ఐపీఓ నిధుల సమీకరణలో మందగమనం

– ప్రథమార్థంలో 26% క్షీణత – ఇష్యూకు వచ్చిన 31 కంపెనీలు.. ముంబయి : భారత్‌లో ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)…

హైదరాబాద్‌లో ఆఫీసు స్పేస్‌కు డిమాండ్‌

– నైట్‌ ఫ్రాంక్‌ రిపోర్ట్‌ హైదరాబాద్‌ : దేశంలోనే అత్యధిక కొత్తగా కట్టిన కార్యాలయాలను పూర్తి చేసిన నగరంగా హైదరాబాద్‌ నమోదయ్యిందని…

కొత్త విక్రేతలకు మీషో అవకాశాలు జిఎస్‌టియేతర సదుపాయం

హైదరాబాద్‌ : ఇ-కామర్స్‌ వేదిక మీషో దేశంలోని లక్షలాది మంది కొత్త విక్రేతలకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.…

అల్పాహారంగా బాదంపప్పు మేలు

– బాదంతో ఆహార నాణ్యత మెరుగు పడుతుంది – కొంతమంది పెద్దలలో తక్కువ కేలరీల ఆహారం, గుండె ఆరోగ్య ప్రయోజనాలు నవతెలంగాణ…

హైదరాబాద్‌ లోనే నైట్ ఫ్రాంక్ ఇండియా కార్యాలయాలు అధికం

నవతెలంగాణ హైదరాబాద్: ‘ఇండియా రియల్ ఎస్టేట్ Q3 2023‘ పేరుతో నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం, 2023లో Q3…

తొలి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) ప్రిఫరెన్స్ ఇండెక్స్‌ను ఆవిష్కరించిన హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్

ఎన్పీఎస్ దివస్ సందర్భంగా
ఈ ఫలితాలు ఇప్సోస్తో కలిసి 12 భారతీయ నగరాల్లో నిర్వహించిన సర్వే ఆధారితమైనవి

 నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)ను ఉపయోగించి రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవడం గురించి భారతీయ వినియోగదారుల్లో అవగాహన పెంచడంలో ముందుంటున్న భారతీయ దిగ్గజ పెన్షన్ ఫండ్ మేనేజర్స్లో హెచ్డీఎఫ్సీ పెన్షన్ కూడా ఒకటి.

 

అక్టోబర్ 1న ఎన్పీఎస్ దివస్గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వివిధ వినియోగదారుల వర్గాల్లో ఎన్పీఎస్ ప్రాధాన్యతను ప్రస్ఫుటంగా తెలియజేసేలా ఎన్పీఎస్ ప్రిఫరెన్స్ ఇండెక్స్ను హెచ్డీఎఫ్సీ పెన్షన్ ఆవిష్కరించింది. ఈ తరహా వాటిలో ఇదే మొదటిది.

 

ఎన్పీఎస్ అనేది పదవీ విరమణ తర్వాత కాలంలో భారతీయ పౌరులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వ మద్దతు గల ఒక రిటైర్మెంట్ సేవింగ్స్ పథకం. 18-70 ఏళ్ల వయస్సు గల ఏ భారతీయ పౌరులైనా స్వచ్ఛంద ప్రాతిపదికన ఎన్పీఎస్కు సబ్స్క్రైబ్ చేయొచ్చు.

ఎన్పీఎస్ ప్రిఫరెన్స్ ఇండెక్స్ కోసం సర్వే నిర్వహించేందుకు స్వతంత్ర మార్కెట్ రీసెర్చ్ స్పెషలిస్ట్ ఇప్సోస్ను హెచ్డీఎఫ్సీ పెన్షన్ నియమించుకుంది. ఈ ఫలితాలు, ప్రథమ/ద్వితీయ/తృతీయ శ్రేణి (టియర్ I/II/II) ప్రాంతాల్లో 30-40 ఏళ్లు మరియు 45-55 ఏళ్ల వయస్సు గల వారై ఉండి, ఎన్పీఎస్పై అవగాహన ఉన్న 1,801 మందిపై నిర్వహించిన కన్జూమర్ మార్కెట్ రీసెర్చ్ స్టడీ* ఆధారితమైనవి. పదవీ విరమణపై వినియోగదారుల అభిప్రాయం, అలాగే దాని గురించి వారికి గల అవగాహన, ఆకర్షణీయత మరియు పరిశీలన మొదలైన వాటిని అర్థం చేసుకోవడం ఈ సర్వే ప్రధాన లక్ష్యం. ఇది కాలక్రమేణా ట్రాక్ చేయదగినఎన్పీఎస్ ప్రిఫరెన్స్ ఇండెక్స్కు దారి తీసింది. ప్రస్తుతం ఎన్పీఎస్ ప్రిఫరెన్స్ ఇండెక్స్ 54 వద్ద ఉన్నట్లుగా (0 నుంచి 100 వరకు స్కేలుపై) సర్వేలో వెల్లడైంది. కాబట్టి, ప్రస్తుతం ఎన్పీఎస్ ప్రిఫరెన్స్ ఇండెక్స్ అనేది ఒక మోస్తరు స్థాయిలోనే ఉందని, మూడు మూల స్తంభాలైన అవగాహన, ఆకర్షణీయత, పరిశీలన దీన్ని సమాన స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయని అంచనాకు రావచ్చు. వినియోగదారుల ఆదాయ స్థాయులు పెరిగే కొద్దీ ఎన్పీఎస్ ప్రిఫరెన్స్ ఇండెక్స్ మెరుగుపడుతుంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాదిలో ఎన్పీఎస్ ప్రిఫరెన్స్ ఇండెక్స్ అత్యధిక స్థాయిలో (57) ఉంది.

నివేదికలోని ఇతరత్రా మరికొన్ని ప్రత్యేక అంశాలు:
 ▪          రిటైర్మెంట్ ప్రణాళికను మొదలుపెట్టేందుకు సగటున 32 ఏళ్ల వయస్సు అనేది సముచితమైన వయస్సుగా పరిగణిస్తున్నప్పటికీ, రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరానికి అంతగా ప్రాధాన్యం ఉండటం లేదు. సముచిత రిటైర్మెంట్ నిధిగా వినియోగదారులు సగటున సూచించిన రూ. 1.3 కోట్ల మొత్తం అనేది, వారి కుటుంబ ప్రస్తుత వార్షికాదాయానికి పది రెట్ల కన్నా తక్కువేనని తేలింది. సిఫార్సు చేయబడిన రిటైర్మెంట్ నిధి స్థాయుల గురించి వినియోగదారుల్లో అవగాహన పెంచాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది.
▪          పెట్టుబడికి భద్రత, పన్నుపరమైన ప్రయోజనాలు, మరణానంతరం ఆదాయం కొనసాగడమనేవి రిటైర్మెంట్ సాధనాల్లో కీలకాంశాలుగా ఉంటున్నాయి. మిగతావాటితో పోలిస్తే కాస్త కొత్తదే అయినప్పటికీ పన్ను రహిత విత్డ్రాయల్స్, భద్రత (ప్రభుత్వ నియంత్రణలో ఉండటం), జీవిత భాగస్వామికి ప్రయోజనం చేకూర్చగలిగేది కావటం వంటి ఆకర్షణీయమైన ఫీచర్ల దన్నుతో ఎన్పీఎస్ ఓనర్షిప్ 24%గా ఉంది. వినియోగదారులందరితో (31 శాతం) పోలిస్తే ఎన్పీఎస్లో నమోదు చేసుకున్న వారికి పన్ను ప్రయోజనం (80C/80CCD) అత్యంత ఆకర్షణీయమైనదిగా (35%)గా ఉంది.

▪          ఎన్పీఎస్ కొనుగోలు చేయడంలో పన్ను ప్రయోజనాలు, తోటివారు, ఆర్థిక సలహాదారుల పాత్ర ఉంటున్నప్పటికీ, దాని వినియోగాన్ని పెంచేందుకు ఎన్పీఎస్ మరియు దాని ఫీచర్ల గురించి ప్రజల్లో అవగాహన పెంచడం చాలా కీలకమైన అంశం. ఎన్పీఎస్తీసుకున్న వ్యక్తులు రిటైర్మెంట్ తర్వాత కాలంలో తమ ఆర్థిక ఆరోగ్యం గురించి మరింత ఎక్కువ ధీమాగా ఉన్నట్లు వెల్లడైంది. కాబట్టి, రిటైర్మెంట్ తర్వాత జీవితం కోసం ఆర్థికంగా సన్నద్ధమవడానికి ఎన్పీఎస్ ఓనర్షిప్ అనేది ఒక స్పష్టమైన సూచిక అని చెప్పవచ్చు.

* భారతదేశంలోని 12 నగరాల వ్యాప్తంగా, NCCS Aలో కుటుంబ వార్షికాదాయం రూ. 10 లక్షలకు పైన (తృతీయ శ్రేణి పట్టణాల్లో రూ. 7 లక్షలకు మించి) ఉన్న వారితో, ఆగస్ట్సెప్టెంబర్ 2023 మధ్య ముఖాముఖి వ్యక్తిగత ఇంటర్వ్యూల రూపంలో ఈ కన్జూమర్ రీసెర్చ్ అధ్యయనం నిర్వహించబడింది.
నివేదిక ఆవిష్కరణ సందర్భంగా హెచ్డీఎఫ్సీ పెన్షన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీరామ్ అయ్యర్ మాట్లాడుతూ, “ఎన్పీఎస్ దివస్ సందర్భంగా, పరిశ్రమలోనే తొలిసారిగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)పై ప్రధానంగా దృష్టి పెట్టే ఎన్పీఎస్ ప్రిఫరెన్స్ ఇండెక్స్ నివేదికను ఆవిష్కరించడం సంతోషకరమైన విషయం. ఆర్థిక భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఉంటున్న తరుణంలో, రిటైర్మెంట్ అనంతర జీవితాన్ని నిశ్చింతగా గడిపేలా వ్యక్తులకు సాధికారత కల్పించాలన్న మా నిబద్ధత మరింత బలోపేతంగా మారిందిఅని చెప్పారు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) అనేది రిటైర్మెంట్ తర్వాత ఆదాయాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా దీర్ఘకాలంలో ఆర్థిక భద్రతకు భరోసా కల్పించడంలో కీలకంగా ఉంటోంది. భారతదేశంలో, ఎన్పీఎస్ వినియోగాన్ని పెంచేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయి. అందుకే దీన్ని మరింత లోతుగా అధ్యయనం చేసి, మరింతగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవగాహన కల్పించడం ఒక్కటే మా లక్ష్యం కాదు; ఎన్పీఎస్గురించి వ్యక్తులకు మరింత అర్థమయ్యేలా తెలియజేయాలన్నది కూడా ఈ లక్ష్యంలో భాగమే. అందుకే మేము మరింత కసరత్తు చేసిఎన్పీఎస్ ప్రిఫరెన్స్ ఇండెక్స్ను ఆవిష్కరించాం. ఇది, అవగాహన, ఆకర్షణీయత, పరిశీలన అనే మూడు విస్తృతాంశాల అధ్యయనం ఆధారంగా రూపొందించిన ఒక శక్తిమంతమైన కొలమానం.

రిటైల్ మరియు కార్పొరేట్ ఎన్పీఎస్ సెగ్మెంట్లలో అత్యధిక సంఖ్యలో చందాదారులతో (2023 సెప్టెంబర్ 1 నాటికి 16,92,504 మంది) హెచ్డీఎఫ్సీ పెన్షన్ అనేది భారత్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న దిగ్గజ పెన్షన్ ఫండ్ మేనేజర్. 2023 మే 15 నాటికి హెచ్డీఎఫ్సీ పెన్షన్ రూ. 50,000 కోట్ల ఆస్తుల నిర్వహణ (ఏయూఎం) మైలురాయిని అధిగమించింది. అంతేగాకుండా 2019 నుంచి 2022 వరకు వరుసగా 3 సంవత్సరాల పాటు మనీ టుడే నుంచిబెస్ట్ పెర్ఫార్మింగ్ పీఎఫ్ఎంపురస్కారాన్ని కూడా దక్కించుకుంది.

 అక్టోబర్ 7 నుంచి మింత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్

రాఖీ, ఓనం,వినాయక చవితి నుంచి ఎర్లీ ఇండికేటర్లు ఫ్యాషన్, సౌందర్యం, జీవనశైలి విభాగాల ఉత్పత్తులపై వినియోగదారుల నుంచి అధిక ఆసక్తి మింత్రా…

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ విడుదల

నవతెలంగాణ హైదరాబాద్: శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ (Galaxy S23 FE) స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచవ్యాప్తంగా బుధవారం విడుదలైంది. ఎస్‌23 లాగానే వెనక…

లాజిస్టిక్స్ లో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఈవీ ట్రయల్స్ ను ప్రారంభించిన జేఎస్ డబ్ల్యూ సిమెంట్

– తయారీ కార్యకలాపాలలో ఈ వీ ట్రక్కులకు మారాలనే ప్రణాళిక తో ముందడుగు నవతెలంగాణ హైదరాబాద్: ప్రపంచంలోని మేటి గ్రీన్ సిమెంట్…

ఆండ్రాయిడ్ & iOSలో కామిక్ & వెబ్‌టూన్ యాప్ ‘టూన్‌సూత్ర’

బాహుబలి కామిక్స్ నుండి ఆర్చీ కామిక్స్ వరకు కొత్త యాప్ ప్రపంచ, భారతీయ వెబ్‌టూన్ కంటెంట్, క్రియేటర్ల యొక్క అతిపెద్ద లైబ్రరీని…

మోతీలాల్ ఓస్వాల్ AMC మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ 500 ఇటిఎఫ్(ETF) ప్రారంభం

మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ 500 ఇటిఎఫ్(ETF) అనేది భారతదేశం యొక్క లిస్టెడ్ విశ్వంలో 90% కంటే ఎక్కువ ఎక్స్‌పోజర్‌ను అందించే నిష్క్రియ…

ఔషధ రంగంలోకి నిమ్మగడ్డ ప్రసాద్‌ రీఎంట్రీ

– ఐక్వెస్ట్‌ చేతికి వియాట్రిస్‌ భారత ఎపిఐ వ్యాపారం – హైదరాబాద్‌లోని మూడు ప్లాంట్లు, ఆర్‌అండ్‌డి స్వాధీనం..! హైదరాబాద్‌ : ప్రముఖ…