Thursday, April 16, 2026
E-PAPER
Homeఆటలుబ్యాడ్మింటన్‌కు అక్సెల్సన్‌ గుడ్‌బై

బ్యాడ్మింటన్‌కు అక్సెల్సన్‌ గుడ్‌బై

- Advertisement -

దీర్ఘకాలిక గాయాలతో 32ఏళ్లకే రిటైర్మెంట్‌
కోపెన్‌హగాన్‌(డెన్మార్క్‌):
డెన్మార్క్‌ స్టార్‌ బ్యాడ్మింటన్‌ ఆటగాడు, మాజీ నంబర్‌వన్‌, రెండుసార్లు ఒలింపిక్‌, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ డెన్మార్క్‌కు చెందిన విక్టర్‌ ఆక్సెల్సెన్‌ ప్రొఫెషనల్‌ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్‌ను ప్రకటించారు. 32ఏళ్లకే విక్టర్‌ ఆక్సెల్సెన్‌ తీసుకున్న ఈ నిర్ణయం క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసినా… రెండేళ్లుగా దీర్ఘకాలిక, తీవ్రమైన వెన్ను గాయం కారణంగా ఆక్సెల్సెన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన శరీరం ఆడటానికి సహకరించడం లేదని, ఆక్సెల్సెన్‌ తన రిటైర్మెంట్‌కు గల కారణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. ”చాలామందికి తెలిసినట్లుగా, నేను కొంతకాలంగా నా వీపు నొప్పితో బాధపడుతున్నాను. గత ఏడాది శస్త్రచికిత్స జరిగింది. విస్తతమైన పునరావాసం పొందాను, కానీ అక్టోబర్‌లో నాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి నుండి, నేను అవసరమైన స్థాయిలో ఆడలేకపోతున్నాను.. శిక్షణ తీసుకోలేకపోతున్నాను. నొప్పి నన్ను ఆడకుండా నిరోధించింది,. అది నన్ను ఈ చాలా కష్టమైన నిర్ణయం తీసుకునేలా చేసిందని పేర్కొన్నాడు. తన వైద్యులు, సర్జన్‌తో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆక్సెల్సెన్‌ పేర్కొన్నారు. అక్సెల్సన్‌ రెండుసార్లు ఒలింపిక్‌, మరో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -