Thursday, April 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపబ్లిక్‌డొమైన్‌లో రాష్ట్ర సామాజిక సర్వే నివేదికలు

పబ్లిక్‌డొమైన్‌లో రాష్ట్ర సామాజిక సర్వే నివేదికలు

- Advertisement -

నేటి నుంచే అందుబాటులోకి : మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిం చిన సమగ్ర కుటుంబ సామాజిక సర్వే (సిపెక్స్‌)తో పాటు నిపుణుల కమిటీ నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం నుంచే సవర.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో ఈ సర్వే నివేదికలు ఉంటాయని వివరించారు. దేశ ప్రజలు ఈ నివేదికలు పరిశీలించి వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సలహాలు సూచనలు ఇవ్వొచ్చని చెప్పారు. ఈ నివేదికల ప్రాతిపదికగా వెనుకబాటుతనాన్ని నిర్మూలించేందుకు భవిష్యత్‌ ప్రణాళికలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నదనీ, దానిపై రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌పార్టీ అభిప్రాయాలను ఇప్పటికే స్పష్టంచేశామన్నారు. దేశంలో కులగణన చేయబోమని 30 నెలల క్రితం కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు లేఖ ఇచ్చిందనీ, రాష్ట్రంలో కుటుంబసర్వే సమర్థవంతంగా నిర్వహించాక, తాము కూడా దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కేంద్రం ప్రకటించాల్సి వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 42 అంశాలతో వెనుకబాటుతనాన్ని కొలిచే ప్రయత్నం చేసి, దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో బుధవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరోమంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్‌ ఉత్పల్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 97.10 శాతం కుటుంబాలకు సంబంధించి సమగ్ర కుటుంబ సామాజిక జనగణన సర్వేను లక్షా 3వేల మంది ప్రభుత్వ ఉద్యోగులతో ప్రణాళికా విభాగం సమర్థవంతంగా నిర్వహించిందని తెలిపారు. దీనిపై రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డి, కంచె ఐలయ్య వంటి వారితో ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేశామనీ, ఆ నివేదికలను అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైందని గుర్తుచేశారు. దాని ప్రకారం రాష్ట్ర జనాభా నిష్పత్తిలో బీసీలు 56 శాతం, ఎస్సీలు 17.42 శాతం, ఎస్టీలు 10.43 శాతం, ఓసీలు 15.79 శాతంతో పాటు 4 శాతం మంది ‘నో క్యాస్ట్‌’ అని ప్రకటించారని చెప్పారు. పార్లమెంటులో సంఖ్యా బలం ఉందనే ఏకైక కారణంతో హడావిడిగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశ ప్రజలకు నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -