Thursday, April 16, 2026
E-PAPER
Homeక్రైమ్భర్త ఆచూకీ చెప్పడం లేదని మహిళ ఆత్మహత్యాయత్నం

భర్త ఆచూకీ చెప్పడం లేదని మహిళ ఆత్మహత్యాయత్నం

- Advertisement -

– అమె ఆరోపణలు ఆవాస్తవమన్న పోలీసులు
– రూ.2.5 కోట్లకు ఐపీ పెట్టి చేతులెత్తేసిన సదరు మహిళ
నవతెలంగాణ కాశిబుగ్గ

తన భర్తను తీసుకెళ్లి 12రోజులుగా ఆచూకీ తెలపడం లేదని బుధవారం వరంగల్‌ దేశాయిపేట సమీపంలోని లక్ష్మీ టౌన్‌ షిప్‌కు చెందిన మాధవి అనే మహిళ తన నివాసంలో ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాధిత మహిళ మాధవి తెలిపిన వివరాల ప్రకారం.. లకీë టౌన్‌షిప్‌కు చెందిన లాడే తిరుపతి- మాధవి భార్యాభర్తలు. తిరుపతిపై ఏనుమాముల పోలీసులు తప్పుడు కేసులు పెట్టి 12రోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లోని కొందరు అధికారులు, వ్యాపారుల ఒత్తిడితోనే తన భర్తను పోలీసులు వేధిస్తున్నారని మాధవి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఆమె ఇంట్లోనే నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

మాధవి ఆరోపణలు అవాస్తవం
లాడే మాధవి తమపై చేసిన ఆరోపణలు అవాస్తవమని ఏనుమాముల ఎస్‌ఐ రాజు తెలిపారు. లాడే తిరుపతి- మాధవి దంపతులు ఏనుమాముల మార్కెట్‌లో మిర్చి వ్యాపారం చేసి రూ.2.5 కోట్లు ఐపీ పెట్టారని చెప్పారు. బాధిత వ్యాపారులు తమకు ఫిర్యాదు చేశారన్నారు. తిరుపతి కోసం తాము వెతుకుతున్నట్టు తెలిపారు.
రూ.2.5 కోట్లకు ఐపీ
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి ప్రాంతానికి చెందిన లాడే తిరుపతి- మాధవి దంపతులు కొన్ని సంవత్సరాలుగా నగరంలోని లక్ష్మీటౌన్‌షిప్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గతంలో తిరుపతి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి వ్యాపారం చేసి ఐపీ పెట్టడంతో అధికారులు ఆయన లైసెన్స్‌ రద్దు చేశారు. అక్కడి నుంచి వరంగల్‌ నగరానికి వచ్చిన తిరుపతి ఏనుమాముల మార్కెట్‌లో తన భార్య మాధవి పేరుపై గాయత్రి ట్రేడర్స్‌ పేరుతో లైసెన్స్‌ తీసుకున్నారు. మిర్చి వ్యాపారం చేయడం ప్రారంభించారు. ఇక్కడ కూడా ఇటీవల రూ.2 కోట్ల 50లక్షల ఐపీ పెట్టడం వ్యాపార వర్గాల్లో కలవరం రేపింది. తిరుపతి- మాధవి దంపతుల నుంచి తమకు డబ్బులు ఇప్పించాలని బాధిత వ్యాపారులు ఏనుమాముల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ వరంగల్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో మార్కెట్‌లో ఆందోళన నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -