Thursday, April 16, 2026
E-PAPER
Homeబీజినెస్పశ్చిమాసియా వృద్ధి 1.1 శాతమే : ఐఎంఎఫ్‌ అంచనా

పశ్చిమాసియా వృద్ధి 1.1 శాతమే : ఐఎంఎఫ్‌ అంచనా

- Advertisement -

వాషింగ్టన్‌ : పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. అమెరికా సాగిస్తోన్న యుద్ధం కారణం గా గల్ఫ్‌ దేశాల చమురు, గ్యాస్‌ ఎగుమతులకు తీవ్ర ఆటంకాలు ఏర్పడటంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తన తాజా నివేదికలో పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల ఆర్థిక వృద్ధి అంచనాలకు భారీగా కోత పెట్టింది. గత జనవరిలో ఈ ప్రాంత వృద్ధి రేటు 3.9 శాతంగా ఉంటుందని అంచనా వేయగా.. మంగళవారం విడుదల చేసిన వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌ లుక్‌లో దానిని ఏకంగా 1.1 శాతానికి పరిమితం చేసింది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతినడం, ఎగుమతులు నిలిచిపోవడం ఈ తిరోగమనానికి ప్రధాన కారణాలుగా పేర్కొంది.

ముఖ్యంగా ఇరాన్‌, ఇరాక్‌, ఖతార్‌ దేశాలపై ఈ ప్రభావం అత్యధికంగా ఉంటుందని ఐఎంఎఫ్‌ హెచ్చరించింది. చమురు ఎగుమతులపైనే ఆధార పడి ఉన్న ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు యుద్ధ వాతావరణం వల్ల కుదేలయ్యే ప్రమాదం ఉంది. కేవలం ఆయా దేశాలకే కాకుండా, ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన ఈ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగు దలకు దారితీస్తోంది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే అది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను మరింత పెంచి ఇతర దేశాల వృద్ధి రేట్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -