గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు
హైదరాబాద్ : అమెరికాకు చెందిన ప్రముఖ వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ ఎల్‌పిఎల్ ఫైనాన్షియల్ తన సేవలను హైదరాబాద్‌కు విస్తరించింది. ఇక్కడ ఏర్పాటు చేసిన తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను బుధవారం తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కేంద్రం సాంకేతికత, డేటా అనలిటిక్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి కీలక విభాగాలకు మద్దతుగా నిలవనుంది. సుమారు 2.4 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తున్న ఈ ఫార్చ్యూన్ 500 సంస్థ హైదరాబాద్‌లోని అద్భుతమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన నిపుణుల లభ్యత కారణంగానే ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ స్థాయి ప్రతిభను ఉపయోగించుకోవడం ద్వారా మరింత చురుకైన, వినూత్నమైన సంస్థగా ఎదగడమే తమ లక్ష్యమని ఆ సంస్థ చీఫ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గ్రెగ్ గేట్స్ పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా తమ క్లయింట్‌లకు తదుపరి తరం సాంకేతిక సేవలను వేగంగా అందించగలమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఐదేళ్లలో ఈ సెంటర్ గ్లోబల్ ఆపరేషన్స్‌లో అత్యంత కీలకమైన హబ్‌గా మారుతుందని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ కాజా ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌కు ఎల్‌పీఎల్ ఫైనాన్షీయల్ విస్తరణ
- Advertisement -
- Advertisement -



