Thursday, April 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయండి

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయండి

- Advertisement -

మార్కెట్‌ యార్డుల్లో అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయండి
జీరో దందాను అరికట్టండి..సహకరించే అధికారులపై చర్యలు తీసుకోండి : మార్కెటింగ్‌, మార్క్‌ఫెడ్‌ అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధిం చి అవసరమైన టార్పాలిన్లు, తేమ కొలమాని, ధాన్యం ఆరబెట్టే యంత్రాలను సిద్ధం చేయాలని మార్కెటింగ్‌, మార్క్‌ఫెడ్‌ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మార్కెట్‌ యార్డుల్లో జీరో దందా జరుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్‌ యార్డుల్లో రెండేండ్ల కాలంలో చేపట్టిన పనుల పురోగతిపై బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో మార్కెట్‌ రుసుము వసూళ్లను పారదర్శకంగా, సమర్ధవంతంగావసూలు చేయడానికి చర్యలు తీసుకున్నామని మంత్రికి మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి వివరించారు. రెండేండ్లలో మార్కెట్‌ యార్డుల్లో రూ 568.50 కోట్లతో 630 అభివృద్ధి పనులు ప్రభుత్వం మంజూరు చేసిందనీ, వాటిలో రూ.128 కోట్లు విలువైన 113 పనులు పూర్తిచేశామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. మార్కెట్లలో ఇంకా కొన్ని చోట్ల జీరో బిజినెస్‌ జరుగుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందనీ, జీరో బిజినెస్‌ చేసే ట్రేడర్ల లైసెన్స్లు రద్దు చేయడంతో పాటు వారికి సహకరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల పురోగతిని రోజువారీగా సమీక్షించేందుకు డాష్‌బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. మార్కెట్‌ యార్డుల్లో రైతులకు సౌకర్యం కల్పించే పనులను ప్రాధాన్యత పాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. పంట ఉత్పత్తులు రక్షించే విధంగా చేపట్టే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మార్కెటింగ్‌ శాఖ ఇంజినీరింగ్‌ విభాగంలో అవసరమైతే మరికొంత మందిని వేరే శాఖల నుంచి డిప్యూటేషన్‌ పై తీసుకొనే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీలో ‘స్మార్ట్‌ మార్కెట్‌ యార్డ్‌’ సాఫ్ట్‌ వేర్‌ ద్వారా మార్కెట్‌ కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు మంత్రికి తెలిపారు. కోహెడ పండ్ల మార్కెట్‌ ను సంబంధించి ఎంపిక చేసిన ప్రదేశంలో సర్వే పూర్తయిందని, పనులను చేపట్టడానికి టెండర్ల ప్రక్రియ త్వరలో చేపట్టనున్నట్లు వివరించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ..ఆశాజన ఫలితాలుంటే అన్ని మార్కెట్‌ యార్డు కమిటీలను డిజిటలైజేషన్‌ చేసి జీరో బిజినెస్‌ను అరికట్టాలని ఆదేశించారు. కోహెడ మార్కెట్‌ అభివృద్ధి పనులపై నిర్ధిష్ట కాలపరిమితి పెట్టుకుని ముందుకెళ్లాలని ఆదేశించారు. హాకా ద్వారా ఐదేండ్ల సమగ్ర నిర్వహణలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీల అంతటా విద్యుత్‌ బిల్లుల తగ్గించడానికి గ్రిడ్‌ ను అను సందిస్తూ సోలార్‌ రూప టాప్‌ ప్యానెల్‌ ల ద్వారా విద్యుత్పత్తి అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రయోగాత్మకంగా నాలుగు మార్కెట్‌ యార్డుల్లో చేపట్టిన పనుల పురోగతి పై ఆరాతీశారు. రైతుల నుంచి సేకరించే మొక్కజొన్నకు సంబంధించిన మొత్తాన్ని రైతుల ఖాతాలకు విడుదల చేసేందుకు సీఎం అనుమతితో నిధులు సమకూరుస్తామని హామీనిచ్చారు. సమీక్షలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, మార్క్‌ఫెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -