Thursday, April 16, 2026
E-PAPER
Homeబీజినెస్పవన్‌ ఖేరాపై బెయిల్‌ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

పవన్‌ ఖేరాపై బెయిల్‌ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

- Advertisement -


న్యూడిల్లీ :
కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరాకు వారం రోజుల ట్రాన్సిట్‌ ముందస్తు బెయిల్‌ జారీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. తెలంగాణ హైకోర్టు ఈ ఉత్తర్వులపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ చందూర్కర్‌ లతో కూడిన ధర్మాసనం తెలిపింది. పవన్‌ ఖేరా అస్సాంలోని సంబంధిత కోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే, ఈ స్టే ఆయనకు నష్టం కలిగించదని, ఎలాంటి ప్రతికూలతలకు దారితీయదన్నారు. హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ అస్సాం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ పై ఖేరా, ఇతర ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -