కొత్తగా మైఎల్‌ఐసీ యాప్ ఆవిష్కరణ
ముంబయి : ప్రభుత్వ దిగ్గజ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తమ పాలసీదారులకు మరింత మెరుగైన, స్మార్ట్ సేవలను అందించడానికి తన డిజిటల్ సేవలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. బుధవారం ముంబయిలో జరిగిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి త్వ శాఖ కార్యదర్శి ఎం. నాగరాజు వినియోగదారుల కోసం ‘మైఎల్‌ఐసీ’ యాప్‌ను, సేల్స్ ఏజెంట్ల కోసం ‘సూపర్ సేల్స్ సాథీ’ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. ”ఎల్‌ఐసీ డిజిటల్ వ్యవస్థ కేవలం సేవా సౌకర్యంగానే కాకుం డా, వ్యూహాత్మక పంపిణీ వేదికగా మారుతోంది. 26 కోట్ల పాలసీలతో దేశవ్యాప్తంగా విస్తరించిన ఎల్‌ఐసీకి ఈ మొబైల్ యాప్‌లు సేవా సామర్థ్యాన్ని పెంచ డంలో కీలక పాత్ర పోషిస్తాయి” అని ఆకాంక్షించారు.
”ఈ మొబైల్ యాప్‌లు ఇకపై కేవలం సహాయక సాధనాలు మాత్రమే కావు.. ఇవి కస్టమర్ అనుభవాన్ని, పాలసీ విక్రేతల పనితీరును నిర్దేశించే వ్యూహాత్మక ఆస్తులు” అని ఎల్‌ఐసీ సీఈఓ, ఎండీ ఆర్ దొరైస్వామి పేర్కొన్నారు. మైఎల్‌ఐసీ యాప్ ద్వారా పాలసీదారులు ప్రీమియం చెల్లింపులు, పేపర్‌లెస్ లోన్ వంటి సేవలు పొందవచ్చు. సూపర్ సేల్స్ సాథీ యాప్ ఏజెంట్లకు డిజిటల్ సేల్స్ టూల్స్, ఏఐ ఆధారిత కస్టమర్ గైడెన్స్‌ను అందిస్తూ వారి ఉత్పాదకతను పెంచనుందని ఎల్‌ఐసీ వర్గాలు తెలిపాయి. ఈ వినూత్న యాప్‌లు ఎల్‌ఐసీ సేవలను మరింత వేగవంతం చేస్తూ, కార్యాలయాలపై ఆధారపడటాన్ని భారీగా తగ్గిస్తాయని వెల్లడించాయి.
ఎల్‌ఐసీ సరికొత్త స్మార్ట్ సేవలు
- Advertisement -
- Advertisement -



