Tuesday, September 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులపై సీఎం అసంతృప్తి

‌వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులపై సీఎం అసంతృప్తి

- Advertisement -

30 రోజులు 24 గంటలపాటు 
పని జరగాలని ఆదేశం
సనత్‌ నగర్‌ టిమ్స్‌ తరహాలో 
ఓపీ సేవలు ప్రారంభించాలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గ్రీన్ ఛానల్‌లో నిధులు మంజూరు చేస్తున్నా ‌వరంగల్‌‌ సూపర్‌ ‌స్పెషాలిటీ ఆస్పత్రి పనులు ఎందుకు వేగంగా జరగడం లేదని ‌ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఎంసీఆర్‌‌హెచ్‌ఆ‌ర్‌‌డీ బోధి పెవిలియన్‌లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వచ్చే 30 రోజుల్లో 24 గంటలపాటు ఆస్పత్రి పని జరగాలని సీఎం ఆదేశించారు. వర్క్ షెడ్యూల్ తయారు చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. సీఎంవో అధికారులు నిరంతరం క్షేత్రస్థాయికి వెళ్లి సమీక్ష చేయాలని కోరారు. ప్రత్యేక అధికారులను నియమించి పనులను పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రతి పనికి ఒక ప్రత్యేక అధికారికి బాధ్యత అప్పగించాలని తెలిపారు. ఇక నుంచి ప్రతి రోజూ కలెక్టర్ ఆస్పత్రి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని తెలిపారు. త్వరలో ఓపి సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి చుట్టూ మంచి వాతావరణం ఉండేలా పరిసరాలను తీర్చిదిద్దాలని కోరారు. సనత్ నగర్ టిమ్స్ తరహాలో ఓపీ సేవలు వరంగల్‌లో అందుబాటులోకి తేవాలని సూచించారు. సనత్ నగర్ టిమ్స్‌లో స్టాప్ క్వాటర్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. తక్షణమే స్టాప్ క్వాటర్స్ పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణను ఏజెన్సీకి అప్పగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, ఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, సీఎంవో కార్యదర్శి మాణిక్ రాజ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినా జె చోంగ్తు, మున్సిపల్ శాఖ కార్యదర్శి టికె శ్రీదేవి, వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి, హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -