నవతెలంగాణ-హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ శ్రీ సత్య ప్రకాష్, వివిధ శాఖల ప్రధాన అధిపతులతో కలిసి పాల్గొన్నారు. సికింద్రాబాద్ , హైదరాబాద్, నాందేడ్ మూడు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టేషన్ల నిర్వహణ నియమాలు, నిర్దేశిత విధానాలను కచ్చితంగా పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పనికి సంబంధించిన నియమాలను ఎప్పటికప్పుడు నవీకరణ చేయాలనీ, అలాగే సురక్షిత పని విధానాలపై సిబ్బందికి క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. పశువులు ట్రాక్ దాటుతున్న క్రమంలో చోటుచేసుకునే ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల పశువులను రక్షించవచ్చనీ, లోకోమోటివ్‌లకు నష్టం జరగకుండా చూడాలని చెప్పారు.
రైళ్ల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం సమీక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



