Thursday, April 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుదక్షిణాదికి అన్యాయం చేస్తే పెను ఉద్యమం

దక్షిణాదికి అన్యాయం చేస్తే పెను ఉద్యమం

- Advertisement -

మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు
నియోజకవర్గాల పునర్విభజనతో ముడి పెట్టడానికి వ్యతిరేకం

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) పేరుతో దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గేలా అన్యాయం చేస్తే పెను ఉద్యమం తప్పదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) కేంద్ర ప్రభు త్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఆయన ఎక్స్‌ ద్వారా ట్వీట్‌ చేశారు. దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గితే అది కేవలం రాజకీయ ప్రక్రియగానో లేక చట్ట సవరణ గానో మిగిలిపోదనీ, మొత్తం దక్షిణ భారతదేశం అంతటా ఒక బలమైన ప్రజా ఉద్యమానికి దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. మూడేండ్ల క్రితం తాము తీసుకున్న దృఢమైన నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. తామంతా గర్వించదగ్గ భారతీయులమనీ, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అత్యుత్తమ రాష్ట్రాల ప్రతినిధులమని పేర్కొన్నారు. జనాభా నియంత్రణతోపాటు వివిధ రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న దక్షిణ రాష్ట్రాలకు, ఈ పునర్విభజన వల్ల రాజకీయంగా అన్యాయం జరగడం సమంజసం కాదని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటి ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు. దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటులో తమ ప్రజల స్వరాన్ని, ప్రాతినిధ్యాన్ని అణచివేయాలని చూస్తే తాము నిశ్శబ్దంగా చూస్తూ ఉండబోమని స్పష్టం చేశారు. దక్షిణ భారతీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. ”ఢిల్లీ పాలకులు తమ మాట వినాలనీ, బుద్ధి ప్రబలాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు బీఆర్‌ఎస్‌ మొదటి నుంచి చిత్తశుద్ధితో సంపూర్ణ మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు ఇవ్వడమే కాకుండా, అసెంబ్లీ, శాసన మండలిలో ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేసిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, మార్కెట్‌ కమిటీల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా మహిళా సాధికారత పట్ల తమకున్న అచంచలమైన నిబద్ధతను చాటుకున్నామని వివరించారు. మహిళా రిజర్వేషన్లను నియోజక వర్గాల పునర్విభజన రాజ్యాంగ సవరణ లతో ముడిపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అత్యంత సరళమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సంక్లిష్టం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలనీ, పార్లమెంటులో 543 సీట్లు ఉన్నాయనీ, వాటికి వర్తింపజేయాలని సూచించారు. తెలంగాణ లో 119 అసెంబ్లీ స్థానాలున్నాయనీ, ఇక్కడ కూడా అమలు చేయాలని కోరారు. సీట్ల పెంపు పునర్విభజనతో ముడిపెట్టి ఎందుకు అయోమయా న్ని సృష్టిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు. రాజ్యాంగ విధివిధానాల ప్రకారం మొదట జనగణన, తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, ఆ తర్వాతే నిర్మాణాత్మక మార్పులు జరగాలని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనా లకు విఘాతం కలగని ఏ సహేతుకమైన ప్రతి పాదనకైనా బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. దక్షిణాదికి అన్యా యం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామనీ, అవసరమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -