– మనం నెమ్మదిగా గెలుస్తున్నాం
– శత్రువులకు భయం పుట్టిస్తున్నాం : వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
– సమాజ జబ్బును పోగొట్టేది కళాకారుడే
– సినీనటుల ఎదుగుదలలో పీఎన్‌ఎమ్ పాత్ర కీలకం
– పైసా ఖర్చుపెట్టకుండా అందరికీ విద్యా వైద్యం అందితేనే అభివృద్ధి సాధ్యం : ఆహ్వానసంఘం అధ్యక్షుడు, సినీనటుడు మాదాల రవి
– చమురు నిల్వలపై పట్టుకోసమే ఇరాన్‌పై అమెరికా యుద్ధం
– ప్రజలపక్షాన నిలిచే కళారూపాలు రావాలి : సామాజికవేత్త పీఏ.దేవి
రవీంద్రభారతిలో పీఎన్‌ఎమ్ రాష్ట్ర మూడో మహాసభలు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విలువలకు నిలువుటద్ధం ప్రజానాట్యమండలి అని ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కొనియాడారు. గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని కాదని ప్రజల కోసం, విలువల కోసం ప్రజానాట్యమండలినే నమ్ముకుని ఉన్న కళాకారులకు అభినందనలు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రజానాట్యమండలి రాష్ట్ర మూడో మహాసభలను సీనియర్ నేత నర్సయ్య జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం జరిగిన ప్రారంభ సభలో గోరటి వెంకన్న మాట్లాడుతూ.. తాను ఈ స్థాయి ఎదగడానికి కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యమే కారణమని చెప్పారు. విలువలున్న గాంధీ, సుందరయ్య, అంబేద్కర్ లాంటి నేతలు నేడు కరువయ్యారని వాపోయారు. మనుషులను మార్కెట్‌కు బానిసలుగా మార్చి సమాజాన్ని కులం, మతం పేరుతో విభజించి రాజకీయాలు చేస్తున్న శక్తుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. విలువలను హననం చేసి మనుషులను క్రూరంగా తయారు చేస్తున్న ప్రమాదకర స్థితిని ఎత్తిచూపారు. దోపిడీకి కరుణ ఉండదనీ, దానికి లాభార్జనే ముఖ్యమని చెప్పారు. ఇలాంటి తరుణంలో కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరముం దని నొక్కి చెప్పారు. 40ఏండ్లుగా ఒకే సిద్ధాంతం పట్ల కలిసి కట్టుగా ఉంటున్న గంగదేవిపల్లి, పైసా ఖర్చు పెట్ట కుండా సర్పంచిగా గెలిపించిన మునిపంపుల గ్రామా ల్లోని బలమైన పునాది వ్యవస్థను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఆకాంక్షించారు. మనం నెమ్మదిగా గెలు స్తున్నామనీ, మన గెలుపు శత్రువులకు భయం పుట్టిస్తు న్నదనీ, అందుకే అణచివేతలు, దాడులు పెరుగుతు న్నాయని చెప్పారు. ఆ ఆటలు ఎల్లకాలం చెల్లుబాటు కావనీ, పెరుగుట విరుగుట కోసమేనని చెప్పారు. అంతిమంగా ప్రజలే యుగకర్తలనీ, ప్రజా కళలు వర్థిల్లాలని ఆకాంక్షించారు.

సినీనటులు, మహాసభల ఆహ్వానసంఘం చైర్మెన్ డాక్టర్ మాదాల రవి మాట్లాడుతూ.. ప్రజ లను చైతన్యపర్చడంలో కళలే కీలకమ న్నారు. శరీర జబ్బులను తగ్గించేది డాక్టర్లయితే సమాజానికి పట్టిన జబ్బును పోగొట్టేది కళా కారుడే అని కొనియడా రు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన తెలంగాణ రై తాంగ సాయుధ పోరా టంలో మట్టిమను షులను పులులుగా మార్చి పోరుబాట పట్టించడంలో మా భూమి నాటకం పోషించిన పాత్రను గుర్తుచేశారు. సినీరంగంలో ఎంతోమంది నిలదొక్కుకునే అవకాశం కల్పించిన వారిలో పీ.ఎన్.ఎమ్ వ్యవస్థాపక అధ్యక్షులు గరికపాటి రాజారావు ఒకరనీ, సినీరంగంలోని అల్లూరి రామలింగయ్య, జమున, కే.ఎస్.ప్రకాశ్, మిక్కిలినేని, ఇలా ఎందరో కళాకారులు ప్రజానాట్యమండలి నుంచి వచ్చిన వారేనని వివరించారు. వందేళ్ల సినీరంగ చరిత్రలో విలువలతో కూడిన గొప్ప సినిమాలు రావడం లో ప్రజానాట్యమండలి పాత్రను విడమర్చి చెప్పారు. సమాజంలో కేవలం ఐదుశాతం మంది చేతుల్లో సంపద కేంద్రీ కృతమవుతున్న తీరును వివరించారు. పైసా ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం అందిననాడే, పైసా ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచిన నాడే మన దేశం అభివద్ధిలో ముందుకెళ్తుందని నొక్కి చెప్పారు. ఉచిత విద్య, వైద్యం కోసం పాలకులపై పోరా టం చేసేలా, డబ్బు రాజకీయాలను దూరం చేసేలా ప్రజానాట్య మండలి కళారూపాలుండాలని ఆకాంక్షిం చారు. శత్రువు బలంగా ఉన్న నేపథ్యంలో అభ్యుదయ శక్తులు, వామపక్ష శక్తులు, ప్రజాకళలు ఐక్యం కావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

సామాజిక కార్యకర్త, ప్రజానాట్యమండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి పీఏ.దేవి మాట్లా డుతూ.. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ నాజీ యిజాన్ని వ్యతిరేకిస్తూ ప్రజానాట్య మండలి నాటకాన్ని ప్రదర్శించిందని గుర్తుచే శారు. యుద్ధాలన్నీ ఆర్థిక ఆధిపత్యం, మార్కెట్ విస్తరణ కోసమేనని చెప్పారు. వెనెజులా అధ్యక్షులు మధురో దంపతులను అమెరికా అధ్యక్షులు ట్రంప్ కిడ్నాప్ చేయిస్తే ఒక్క దేశమూ ఖండిం చకపోవడాన్ని ఆక్షేపించారు. ఎఫ్‌స్టిన్ ఫైల్స్‌లో పేరుం డటం, ఆ ఫైల్స్ డేటా నెతన్యాహూ చేతిలో ఉండటం, మరోవైపు డాలర్ విలువ పతనం అవుతుండటంతో ఏమిచేయాలో అర్థంకాక ఇరాన్‌పైట్రంప్ యుద్ధా నికి పూనుకున్నారని విమర్శించారు. మధ్య ప్రాచ్యంపై పట్టు సాధించి చమురు నిల్వలపై ఆధిపత్యాన్ని పెంచుకునేం దుకు ట్రంప్ ప్రయత్నస్తున్నారన్నారు. ఇరాన్‌పై యుద్ధా న్ని మన ప్రధాని మోడీ ఖండించకపోవడాన్ని తప్పు బట్టారు. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేయడాన్ని మోడీ ఖండించారని గుర్తుచేశారు. శతాబ్దాలుగా ఇరాన్‌తో ఇండియాకు ప్రత్యేక అనుబంధం ఉందనీ, దాన్ని మోడీ తెగదెంపుతున్నారని విమర్శించారు. ఇలాంటి తరుణంలో ప్రజల పక్షాన నిలిచే కళలు రావాలని ఆకాంక్షించారు.

రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ.. అమెరికా పెట్టే ప్రతి వాణిజ్య షరతుకూ మోడీ సర్కారు తలూపడం దేశ ప్రయోజనాలకు నష్టదా యకమని హెచ్చరించారు. గతంలో పత్తి దిగుమతు లపై 30శాతం సుంకం ఉండగా మోడీ సర్కారు వచ్చాక దాన్ని 11శాతానికి, ఇప్పుడు పూర్తిగా ఎత్తివేశారని విమర్శించారు. ఇది 60 లక్షల మంది పత్తి రైతులకు నష్టదాయకంగా మారిందని ఎత్తిచూపారు. పాడి దిగుమతులపైనా సుంకాలను ఎత్తేయడం దారుణమ న్నారు. మోడీ ప్రచారం చేస్తున్న ఆత్మనిర్భర భారత్, దేశభక్తి డొల్ల అనీ, ఆయన దేశాన్ని సామ్రాజ్యవాదులకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజానాట్య మండలి కళారూపాలుం డాలని ఆకాంక్షించారు.

ప్రజానాట్యమండలి తెలంగాణ మాజీ అధ్యక్షులు కె.దేవేంద్ర మాట్లాడుతూ..ప్రజల దగ్గరకు కళలను తీసుకెళ్లేందుకు మరింత అధ్యయనం అవసరమని నొక్కిచెప్పారు. సాంస్కృతిక రంగంలో వర్గ పోరాటాన్ని విస్తృత పర్చాలన్నారు. మీడియా కార్పొరేట్ గుత్తాధి పత్యంలో ఉన్న తరుణంలో సోషల్‌మీడియా వేదిక గా ప్రత్యామ్నాయ భావజాల విస్తరణకు కళాకా రులు పూనుకోవాలని పిలుపునిచ్చారు. పీ.ఎన్. ఎమ్ రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్ అధ్యక్ష తన జరిగిన ఈ ప్రారంభ సభలో నవతెలం గాణ ఎడిటర్, పీఎన్‌ఎమ్ పూర్వ కార్యదర్శి రాంపల్లి రమేశ్, పీఎన్‌ఎమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నాటక రచయిత కె.శాంతారావు, ప్రజా నాట్యమం డలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహ, మహా సభ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యద ర్శి ఎన్.మారన్న, ప్రజానాట్య మండ లి ఏపీ అధ్యక్ష, కార్యదర్శులు మంగరాజు, అనిల్, మహా రాష్ట్ర షోలా పూర్‌టీమ్ లీడర్ రఘు, పీఎన్ ఎమ్ ఆఫీస్ బేర ర్లు, తదితరులు పాల్గొన్నారు.



