Magazines

అదా అస‌లు క‌థ‌...

1 గంట క్రితం

avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

కాళేశ్వ‌రం.. ఈ కార్ రేస్‌, ఆ త‌ర్వాత ఇప్పుడు అక్ర‌మాస్తులపై విచార‌ణ‌... ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌పై ఇలా సాగుతోంది అధికార కాంగ్రెస్ ఆరోప‌ణ‌ల వెల్లువ‌. ఇప్ప‌టికి హ‌స్తం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చి.. రెండున్న‌రేండ్లు దాటింది. మ‌రి అప్ప‌టినుంచి కేసీఆర్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యులు చేసిన నేరాలు, ఘోరాల‌పై కేసులు న‌మోదు చేసి, జైలుకు పంపొచ్చు క‌దా? ఈ డౌటు అంద‌రికీ వ‌స్తోంది. కానీ రేవంత్ స‌ర్కార్ ఆ ప‌ని చేయ‌టం లేదు. పైగా మూణ్నెల్లు, ఆర్నెల్ల‌కోటి చొప్పున కొత్త అంశాల‌ను తెర‌పైకి తెస్తూ... కాల‌యాప‌న చేస్తోందంటున్నారు విశ్లేష‌కులు. ప్ర‌భుత్వం మీ చేతుల్లో ఉంది, చ‌ట్టం మీ చేతుల్లోనే ఉంది.. ఎందుకీ కాల‌యాప‌న అంటూ కాంగ్రెస్ నేత‌ల‌ను అడిగితే వారు దాట వేస్తున్నారే త‌ప్ప స‌మాధానం చెప్ప‌టం లేదు. దీనిపై ఆరా తీయ‌గా... ఓ కొంగొత్త విష‌యం తెలిసింది. అదేమంటే... పొరుగు రాష్ట్రంలో జైలుకెళ్లిన త‌ర్వాతే జ‌గ‌న్‌, చంద్ర‌బాబు సీఎం అయ్యారు. ఆ మాట‌కొస్తే ఇక్క‌డ తెలంగాణాలో కూడా జైలు కెళ్లిన రేవంత్ రెడ్డే సీఎం అయ్యారు. అంటే మ‌న దేశంలో నేత‌ల‌ప‌ట్ల సానుభూతి అలా ప‌ని చేస్తుంద‌న్న‌మాట‌. అందుకే కాబోలు... ఇప్ప‌టికిప్పుడు బీఆర్ఎస్ నేత‌ల‌ను లోప‌లికి పంపిస్తే.. వారిపై సానుభూతి పెరిగి, త‌మ‌కు ఎక్క‌డ న‌ష్టం క‌లుగుతుందోన‌న్న భ‌యంలో కాంగ్రెస్ స‌ర్కార్ త‌ట‌పటాయిస్తోందంట‌. అందుకే కాసులు, కేసులంటూ కాల‌యాప‌న చేస్తున్నార‌నేది పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ టాక్‌. -బి.వి.య‌న్‌.ప‌ద్మ‌రాజు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్