Wednesday, April 30, 2025
Homeఆటలుఅందుకు నేనేమీ సిగ్గుపడడం లేదు: పాక్ కెప్టెన్ రిజ్వాన్

అందుకు నేనేమీ సిగ్గుపడడం లేదు: పాక్ కెప్టెన్ రిజ్వాన్

నవతెలంగాణ – హైదరాబాద్: తాను ఇంగ్లీష్ భాష మాట్లాడే విధానంపై వస్తున్న విమర్శల పట్ల పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందించాడు. తన నుంచి మంచి క్రికెట్ ను ఆశించాలేకానీ, తాను ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాను అనేది ముఖ్యం కాదని స్పష్టం చేశాడు. తనకు వచ్చిన భాషలో మాట్లాడతానని, ఎవరెమనుకున్నా తనకు అనవసరం అని తేల్చి చెప్పాడు. “నేను ఎలా మాట్లాడతానో చూసి నన్ను అంచనా వేసేవాళ్ళ గురించి నేను పట్టించుకోను. నా గుండెల్లోంచి వచ్చే ప్రతి మాటను నేను గర్వంగా చెబుతాను. నాకు ఇంగ్లీష్ సరిగ్గా రానందుకు నేను బాధపడుతున్నాను, ఎందుకంటే నాకు సరైన చదువు లేదు. కానీ పాకిస్తాన్ కెప్టెన్‌గా ఉండి ఇలాంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నందుకు నేను సిగ్గుపడను. నేను బాగా చదువుకోలేదు కాబట్టి ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నాను. నా జూనియర్లకు నేను ఒకటే చెబుతాను… బాగా చదువుకుని రండి, లేదా మీ చదువును కొనసాగించండి. అప్పుడు మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడగలరు. ఇప్పుడు నేను క్రికెట్‌ను వదిలేసి పుస్తకాలు పట్టుకుని ప్రొఫెసర్ ను కాలేను, నాకు అంత టైం లేదు” అని రిజ్వాన్ పేర్కొన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img