Wednesday, April 30, 2025
Homeజిల్లాలుఅగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన సీపీ

అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన సీపీ

నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ అగ్నిమాపక కేంద్రంలో ఆదివారం అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చేతుల మీదుగా అగ్నిమాపక వారోత్సవాలు బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను సంబంధిత అగ్నిమాపక శాఖ అధికారులు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. అందుకు అనుగుణంగా ప్రజలందరూ అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం నిజామాబాద్ ఫైర్ అధికారి నర్సింగరావు మాట్లాడుతూ.. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని అన్ని ఫైర్‌ స్టేషన్ల పరిధిలోని ప్రజలకు తమ సిబ్బం ది అవగాహన కల్పిస్తారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అగ్నిప్రమాదం జరిగితే వెంటనే 101 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సూపర్డెంట్ నవాజ్ఖాన్, సంబంధిత వైరాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img