Wednesday, April 30, 2025
Homeజాతీయంఅధిక ఉష్ణోగ్రతలు.. 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

అధిక ఉష్ణోగ్రతలు.. 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్‌: తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటింది. దీంతో రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ ఏడు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img