నవతెలంగాణ-హైదరాబాద్: ఓటర్లు, పోల్ అధికారులు, రాజకీయ పార్టీల కోసం ఎన్నికల సంఘం కొత్త డిజిటల్ ఇంటర్‌ఫేస్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 40కి పైగా మొబైల్, మరికొన్ని వెబ్ అప్లికేషన్‌లను అనుసంధానం చేసింది. ఈ డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలకు ఇసిఐనెట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని పోల్ ప్యానెల్ ఆదివారం తెలిపింది. ఈ కొత్త ఫ్లాట్‌ఫారమ్ ద్వారా వినియోగదారులపై ఒత్తిడి తగ్గుతుందని పోల్ ప్యానెల్ వెల్లడించింది. బహుళ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం, క్రాస్ చెక్ చేయడం, వివిధ రకాల లాగిన్‌లను గుర్తుంచుకోవడం వంటివి వినియోగదారులపై పడే భారాన్ని ఈ కొత్త ప్లాట్‌ఫామ్ తగ్గిస్తుంది. ఇటీవల జరిగిన ప్రధాన ఎన్నికల అధికారుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదన మేరకు ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను ఎన్నికల సంఘం అభివృద్ధి చేసింది. ఎన్నికల డేటాను వినియోగదారుల డెస్క్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లకు యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ డేటాను ఎన్నికల సంఘం అధికారి మాత్రమే నమోదు చేస్తారు.
ఈసీ మరో కీలక ఆవిష్కరణ..ఎన్నికల డేటాపై డిజిటల్ ఇంటర్‌ఫేస్ డెవలప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES