Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఎపి, తెలంగాణ భవన్‌ను పేల్చేస్తాం : ఢిల్లీలో బాంబు బెదిరింపు

ఎపి, తెలంగాణ భవన్‌ను పేల్చేస్తాం : ఢిల్లీలో బాంబు బెదిరింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశ రాజధాని ఢిల్లీలోని ఎపి, తెలంగాణ భవన్‌ ను పేల్చేస్తామంటూ … దుండగులు శుక్రవారం పంపిన మెయిల్‌ కలకలం రేపింది. పహల్గాం ఉగ్రదాడి తరువాత దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌, ఇండియా గేట్‌ కు కాస్త దూరంలో ఉన్న ఎపి, తెలంగాణ భవన్‌ కు మెయిల్‌ రావడం భయభ్రాంతులకు దారితీసింది. ఎపి భవన్‌ అధికారుల వివరాల మేరకు … నిన్న రాత్రి 8 గంటల 30 నిముషాలకు ఢిల్లీలోని సీనియర్‌ అధికారుల కోసం ”పూలే” సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో బాంబు బెదిరింపు మెయిల్‌ రావడంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీల తర్వాత బాంబు లేదని నిర్థారించడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు మెయిల్‌ పంపిన వారిని గుర్తించి, అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad