నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటనతో వణికిపోయిన పర్యటకులు వీలైనంత త్వరగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు సొంత ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యారు. కేవలం 6 గంటల వ్యవధిలోనే 3,300 మంది శ్రీనగర్‌ను వీడినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ‘‘ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్ నుంచి పర్యటకుల సురక్షిత ప్రయాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. విమానాశ్రయంలో రద్దీ దృష్ట్యా ప్రత్యేక సదుపాయాలు కల్పించాం. ఆహారం, నీరు అందించాం. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టు నుంచి 20 విమానాలు వెళ్లాయి. 3,337 మంది పర్యటకులు ఈ ప్రాంతాన్ని వీడారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు విమానాలు అందుబాటులో ఉంచాం. టికెట్ ధరలు పెంచొద్దని విమానయాన సంస్థలను ఆదేశించాం. ఇప్పటికే అన్ని ఎయిర్‌లైన్లు టికెట్ క్యాన్సిలేషన్, రీషెడ్యూల్ ఛార్జీలను రద్దు చేశాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో మనమంతా పర్యటకులకు అండగా నిలవాలి’’ అని కేంద్రమంత్రి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
కశ్మీర్‌ను వీడుతున్న పర్యటకులు..
- Advertisement -
RELATED ARTICLES