Wednesday, April 30, 2025
Homeజాతీయంకశ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్..లష్కరే తోయిబా టాప్‌ కమాండర్ హతం

కశ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్..లష్కరే తోయిబా టాప్‌ కమాండర్ హతం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్‌గామ్‌ ఉగ్రదాడితో భారత సైన్యం అప్రమత్తమైంది. జమ్ము ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలింపు చేపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం బందిపొరా జిల్లాలో ఎన్‌కౌంటర్‌ చేటచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన టాప్‌ కమాండర్‌ హతమయ్యారు.పెహల్‌గామ్‌ దాడి నేపథ్యంలో భద్రతా బలగాలు గత మూడు రోజులుగా కశ్మీర్‌ లోయలో ఉగ్రమూకలపై పంజా విసురుతున్నారు. విస్తృతంగా సెర్చ ఆపరేషన్‌ చేపడుతున్నారు. ఈ క్రమంలో బందిపొరాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా నిఘా సమాచారంతో భారత సైన్యం, జమ్ము పోలీసులు ఆ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా టాప్‌ కమాండర్‌ అల్తాఫ్‌ లల్లి హతమయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img