Friday, July 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఈనెల 14న భూమ్మీద‌కి రానున్న శుభాన్షు శుక్లా

ఈనెల 14న భూమ్మీద‌కి రానున్న శుభాన్షు శుక్లా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆక్సియం-4 () మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు అస్ట్రోనాట్స్ జూలై 14న భూమి మీదకు రానున్నట్టు నాసా ప్రకటించింది. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆక్సియం-4 మిషన్ పురోగతిని నిశితంగా పరిశీలిస్తు్న్నామని, దానిని ఈనెల 14న అన్ డాక్ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.

కాగా, ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి జూన్ 25న ఆక్సియం-7 మిషన్ ను ప్రయోగించారు. మరుసటి రోజు ఐఎస్ఎస్ లో విజయవంతంగా ల్యాండ్ చేశారు. అప్పటి నుంచి శుభాన్షు సహా ఇతర వ్యోమగాములు ఐఎస్ఎస్‌లో పలు ప్రయోగాలు చేశారు. అయితే వారు జూలై 10నే తిరిగి రావాల్సి ఉండగా దానిని జూలై 14న రానున్నట్టు నాసా తెలిపింది. భూమి మీదకు వచ్చిన అనంతరం వ్యోమగాములు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -