Wednesday, April 30, 2025
Homeజాతీయంతిరువనంతపురం ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

తిరువనంతపురం ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చింది. ఎయిర్‌పోర్టును బాంబులతో పేల్చివేయబోతున్నామని ఇవాళ ఉదయం ఓ ఆగంతకుడు ఎయిర్‌పోర్టు వెబ్‌సైట్‌కు మెయిల్‌ పంపించాడు. దాంతో ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తయ్యారు. బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ను పిలిపించి ఎయిర్‌పోర్టు అంతటా జ‌ల్లెడ ప‌ట్టారు. ఎక్కడా బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బెదిరింపు మెయిల్‌ పంపిన వ్యక్తిని గుర్తించే పనిలోపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img