నవతెలంగాణ – హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పుల మోత మోగింది. బస్తర్ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మృతిచెందారు. వీరి తలలపై రూ.13లక్షల రికార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కొండగావ్-నారాయణ్‌పుర్ సరిహద్దులోని అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది యాంటీ-నక్సల్స్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో వారు పరారయ్యారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో రెండు మృతదేహాలు, ఏకే-47 తుపాకీని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతులను మావోయిస్టు అగ్ర నేత, కమాండర్ హల్దార్, ఏరియా కమిటీ సభ్యుడు రామి అని గుర్తించారు.
దండకారణ్యంలో మరోసారి కాల్పుల మోత..
- Advertisement -
RELATED ARTICLES