నాని నటిస్తున్న కొత్త సినిమా ‘హిట్: ది థర్డ్ కేస్’. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించారు. మే 1న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను సోమవారం వైజాగ్ సంగమ్ థియేటర్‌లో భారీగా తరలివచ్చిన అభిమానులు సమక్షంలో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ,’ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి నా ఫోన్ మెసేజ్‌లతో ఫుల్ అయింది. ట్రైలర్‌కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ ఇది’ అని అన్నారు. అనంతరం మీడియా అడిగిన పలు ప్రశ్నలకు నాని సమాధానమిచ్చారు.
ఇంత వైలెన్స్ ఉన్న సినిమాలో చాగంటి ప్రవచనం వాడటానికి కారణం?
– శైలేష్ ఈ కథ ఐడియా చాగంటికి చెప్పారు. ఆయనకి చాలా నచ్చింది. ఆయన సినిమా కోసం ప్రత్యేకంగా ప్రవచనం చెప్పారు.
– శైలేష్ ఈసారి యాక్షన్ కోసం ఎలాంటి వర్క్ చేశారు?
-ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీకి చాలా ప్రాధాన్యత వుంటుంది. లీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. స్క్రీన్ పై చాలా కొత్తగా ఉంటుంది.
ఇంత వైలెన్స్ సినిమా ఆడియన్స్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది?
– మనకంటే పదింతలు వైలెన్స్ సినిమాలు తీసే దేశాల్లో మన కంటే క్రైమ్ రేట్ తక్కువగా ఉంది. మన బుద్ధి సరిగ్గా ఉండాలి. మేము ఎంత బాధ్యతగా తీశామో సినిమా చూస్తే తెలుస్తుంది. ఇందులో మంచి మెసేజ్ కూడా ఉంది. ధర్మం కోసం నిలబడ్డ మనిషి ఎంత దూరం వెళ్ళాడనేది ఇందులో చూస్తారు.
ధర్మం కోసం చేసే యుద్ధం
- Advertisement -
- Advertisement -