Monday, May 5, 2025
Homeఆటలుజిమ్నాస్ట్‌ నిషిక తీన్‌మార్‌

జిమ్నాస్ట్‌ నిషిక తీన్‌మార్‌

- Advertisement -

హైదరాబాద్‌: జాతీయ సీనియర్‌ జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో హైదరాబాద్‌ జిమ్నాస్ట్‌ నిషిక అగర్వాల్‌ మూడు పతకాలతో సత్తా చాటింది. పుణెలో జరిగిన పోటీల్లో నిషిక అగర్వాల్‌ రెండు పసిడి, ఓ సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకుంది. మహిళల వాల్టింగ్‌ టేబుల్‌లో 12.883 స్కోరు, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌లో 11.433 స్కోరుతో నిషిక అగర్వాల్‌ బంగారు పతకాలు సాధించింది. బాలెన్సింగ్‌ బీమ్‌ ఫైనల్లో 10.967 పాయింట్లతో సిల్వర్‌ మెడల్‌ దక్కించుకుంది. అన్‌ఈవెన్‌ బార్స్‌ ఫైనల్లో 9.200 పాయింట్లు సాధించిన నిషిక అగర్వాల్‌ నాల్గో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకుంది. జాతీయ పోటీల్లో మూడు మెడల్స్‌తో పాటు ఆసియా జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు అర్హత సాధించిన నిషిక అగర్వాల్‌ను తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) చైర్మెన్‌ కే. శివసేనా రెడ్డి అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -