నవతెలంగాణ – హైదరాబాద్: పహల్గామ్ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడినట్లు లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తెలిపారు. అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. దాడిలో గాయపడ్డ వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు. బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాలని, వారికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
- Advertisement -