Wednesday, April 30, 2025
Homeఅంతర్జాతీయంపాక్ ర‌క్ష‌ణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పాక్ ర‌క్ష‌ణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు


న‌వతెలంగాణ-హైద‌రాబాద్‌: పాక్ దేశ ర‌క్ష‌ణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ‘అమెరికా, బ్రిటన్‌ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం. అయితే అది పొరబాటు అని అర్థమైంది. దానివల్ల పాక్‌ చాలా ఇబ్బందులు పడింది. సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాక్‌కు తిరుగులేని ట్రాక్‌ రికార్డ్‌ ఉండేది’ అని స్కై న్యూస్‌’ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో పాకిస్థాన్ మ‌రో దురుబుద్ది మారోసారి బ‌ట్ట‌బ‌య‌లైంది. త‌మ గడ్డపై ఉగ్రవాదులే లేరంటూ ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్‌..ఆదేశ ర‌క్ష‌ణ మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌తో అంత‌ర్జాతీయంగా అబాసుపాలైంది.పహల్గాంలోని బైసరన్‌ లోయలో ఏప్రిల్‌ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనక ‘‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ హస్తం ఉన్నట్లు భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది పాక్‌ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ. దీన్ని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img