- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అకాల వర్షాలు ఉత్తర భారత్‌ను ముంచ్చేసిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఉదయం నుంచి సిటీలో ఎండలు దంచికొట్టాయి. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. దీంతో నగరవ్యాప్తంగా బలమైన ఈదురు గాలులు వీచాయి. ఈ క్రమంలో గాలుల ధాటికి నవతెలంగాణ హెడ్ ఆఫీస్ ఎదుట ఉన్న ఓ భారీ వృక్షం కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ అటువైపుగా రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా చెట్టు కింద పార్క్ చేసిన పలు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు.
- Advertisement -