Wednesday, April 30, 2025
Homeబీజినెస్బహ్రైచ్‌లోని 300కి పైగా గిరిజన గ్రామాలలో సిగ్నిఫై వెలుగులు

బహ్రైచ్‌లోని 300కి పైగా గిరిజన గ్రామాలలో సిగ్నిఫై వెలుగులు

నవతెలంగాణ హైదరాబాద్: ప్రతి గ్రామంలో వెలుగు (హర్ గావ్ రోషన్) కార్పొరేట్ సామాజిక బాధ్యత ప్రాజెక్ట్ కాంతి శక్తిని ఉపయోగించి మానవ-వన్యప్రాణుల సంఘర్షణ ప్రభావిత అటవీ ప్రాంతాలలో భద్రతను పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి సారించి, భారతదేశంలోని ఆకాంక్షాత్మక జిల్లాల్లో ఒకటిగా బహ్రైచ్ గుర్తింపుదక్కించుకుంది. శక్తి-సమర్థవంతమైన లైట్లను ఏర్పాటు చేయడంతో మానవ-వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించింది. స్థానిక గ్రామస్తులు చీకటి పడిన తర్వాత స్వేచ్ఛగా, సురక్షితంగా తిరిగేందుకు వీలు కల్పించింది. జీవనోపాధి కార్యకలాపాలకు అవకాశాలను, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో చదువుకునే పిల్లలకు విద్యకు మెరుగైన అందుబాటును కూడా విస్తరించింది. స్థిరమైన లైటింగ్ పరిష్కారాలతో సముదాయాలను శక్తివంతం చేయడం ద్వారా, ఈ ప్రయత్నం ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేసింది. ఇక్కడ గ్రామీణ ఉత్తరప్రదేశ్ నడిబొడ్డున భద్రత, అవకాశం మరియు పురోగతి  ఉజ్వలంగా ప్రకాశిస్తోంది.
స్థానిక FINISH సొసైటీ భాగస్వామ్యంతో జారీ చేసిన ఈ ప్రాజెక్ట్ 300 అటవీ గ్రామాల విస్తారమైన నెట్‌వర్క్‌లో 5000 కన్నా ఎక్కువ అధిక-నాణ్యత ఎల్‌ఈడీ, సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేసింది. ఇటీవల ప్రారంభించిన కార్యక్రమంలో బహ్రైచ్‌లోని కతర్నియా ఘాట్ వైల్డ్‌లైఫ్ డివిజన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (DFO) బి.శివ్ శంకర్ పాల్గొన్నారు. ఇదే సందర్భంలో అటవీ మరియు వన్యప్రాణుల సంరక్షణపై నినాదాలతో కూడిన క్యాలెండర్‌ను కూడా ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు.
గ్రేటర్ ఇండియాలోని ప్రభుత్వ వ్యవహారాలు, కార్పొరేట్ సామాజిక  బాధ్యత విభాగం-  సిగ్నిఫై మార్కెటింగ్, స్ట్రాటజీ విభాగాధిపతి నిఖిల్ గుప్తా ఈ ప్రాజెక్ట్ గురించి తన ఆలోచనలను పంచుకుంటూ, “సిగ్నిఫైలో, జీవితాలను ఉద్ధరించేందుకు కాంతి పరివర్తన శక్తిని మేము విశ్వసిస్తాము. ఈ ప్రయత్నం ద్వారా, మేము కొన్ని మారుమూల గ్రామాలలో సురక్షితమైన, మరింత రక్షణాత్మక వాతావరణాల్ని సృష్టిస్తున్నాము. సామాజిక ప్రభావం కోసం లైటింగ్ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో మా అంకితభావాన్ని ఈ ప్రయత్నం ప్రతిబింబిస్తుంది. ఈ స్థితిస్థాపక సమాజాల పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడంలో అటవీ శాఖ, FINISH సొసైటీతో సహకరించడం మాకు గౌరవంగా ఉంది” అని వివరించారు. అటవీ శాఖ, స్థానిక సంఘాల చురుకైన మద్దతుతో ఈ ప్రయత్నం సాకారమైంది. లైటింగ్ ద్వారా గ్రామీణ సాధికారత  ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి వివిధ భాగస్వాములను ఒకచోట చేర్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img