Wednesday, April 30, 2025
Homeజాతీయంబీజాపూర్‌ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు నక్సలైట్ల హతం

బీజాపూర్‌ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు నక్సలైట్ల హతం

నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. బీజాపూర్‌ జిల్లాలో శనివారం ఉదయం భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు హతమయ్యారు.  జిల్లాలోని కోల్నార్‌ ప్రాంతంలో భద్రతా దళాలు ఇవాళ ఉదయం నక్సల్‌ వ్యతిరేక ఆపరేషన్‌ చేపట్టారు. సీఆర్‌పీఎఫ్‌, ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ సంయుక్త ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు హతమయ్యారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img