నవతెలంగాణ-కామారెడ్డి: బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌డిఎ మిత్రపక్ష పార్టీ అయిన జెడియు అధికారంలో ఉన్న బీహార్‌పై మోడీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్‌లో బీహార్‌పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. తాజాగా 13,480 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో మోడీ ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. బీహార్ మౌలిక సదుపాయాలు, ప్రజా సేవలను బలోపేతం చేసేవిధగా రూపొందించిన పలు రకాల ప్రాజెక్టులను ప్రధాని మోడీ గురువారం మధుబనిలో ప్రారంభించారు. కాగా, బీహార్ గోపాల్‌గంజ్ జిల్లా 340 కోట్ల రూపాయలతో నిర్మించే ఎల్‌పిజి బాట్లింగ్ ప్లాంట్‌కు మోడీ ఈరోజు శంకుస్థాపన చేశారు. అలాగే 1,170 కోట్ల విలువైన కొత్త విద్యుత్ ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. 5,030 కోట్లకు పైగా విలువైన ఇతర ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.
బీహార్‌లో 13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోడీ
- Advertisement -
RELATED ARTICLES