నవతెలంగాణ-హైదరాబాద్: దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో 19న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కేరళ లోని నీలంబర్, పంజాబ్, లూథియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్, కాలిగంజ్, గుజరాత్ లోని విశావదర్, కాడి నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదట ఎన్నికల అధికారులు ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ ఓట్లను లెక్కించారు. అనంతరం ఈవీఎం, వీవీ ప్యాట్ల సీళ్లను ఓపెన్ చేసిన కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు గెలుపెవరిదా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
కాగా, కేరళలోని నిలంబూరు నియోజకవర్గంలో 75.27 శాతం పోలింగ్ నమోదు కాగా.. పంజాబ్‌లోని లుధియానా వెస్ట్ నియోజకవర్గంలో 51.33 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా గుజరాత్‌లోని కడీ నియోజకవర్గంలో 57.91శాతం, విశవదార్‌లో 56.89 శాతం, పశ్చిమ బెంగాల్‌లోని కళిగంజ్ నియోజకవర్గంలో 73.36 శాతం పోలింగ్ రికార్డ్ అయింది.