తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా తెరకెక్కించిన చిత్రం ‘డియర్ ఉమ’. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రం ఈనెల 18న రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. సుమయ రెడ్డి మాట్లాడుతూ, ‘ఓ మంచి కంటెంట్‌ను ఆడియెన్స్‌కు అందించాలని అనుకున్నాను. కథ రాస్తూ ఉండగా ఎంతో కంటెంట్ వచ్చేది. రాజేష్‌తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఆయన తన కథలన్నీ పక్కన పెట్టి నా కథ మీద దృష్టి పెట్టారు. అయితే నన్ను నమ్మి డబ్బులు పెట్టేందుకు ఏ నిర్మాత ముందుకు వస్తారా అని అనుకున్నాను. అప్పుడు మా అమ్మ నన్ను సపోర్ట్ చేశారు. నాకు సంగీతం చాలా ఇష్టం. రథన్ చేసిన ‘అందాల రాక్షసి’ పాటలు చాలా ఇష్టం. కథ చెప్పిన వెంటనే ఆయన ఓకే అన్నారు. నన్ను నమ్మి హీరోగా చేసిన పృథ్వీకి థాంక్స్. ఈనెల 18న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు. ‘తెలుగులో ‘దియా’ తరువాత నాకు ఇక్కడ ఫాలోయింగ్ పెరిగింది. నాగేశ్ వల్లే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. సుమయ ఈ సినిమా కథ రాశారు.. నిర్మించారు.. హీరోయిన్‌గా నటించారు. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఎంతో కూల్‌గా ఉండేవారు. ఇది నా మొదటి తెలుగు సినిమా అవ్వడం నాకు ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని పృథ్వీ అంబర్ చెప్పారు. డైరెక్టర్ సాయి రాజేష్ మహదేవ్ మాట్లాడుతూ, ‘ఇది టెక్నికల్ కంటెంట్ మూవీ.ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అని తెలిపారు.
మంచి కంటెంట్‌తో ‘డియర్ ఉమ’
- Advertisement -
RELATED ARTICLES