Wednesday, April 30, 2025
Homeసినిమామంచి సినిమా చేశాననే తృప్తినిచ్చింది

మంచి సినిమా చేశాననే తృప్తినిచ్చింది

కళ్యాణ్‌ రామ్‌, విజయశాంతి ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లపై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, బ్లాక్‌బస్టర్‌ విజయంతో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ, ‘మా చిత్ర బృందం తరపున ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీవితంలో మంచి సినిమా చేశామనే తప్తి ఉంది. పోలీస్‌గా, మదర్‌గా చాలా విరామం తర్వాత ఒక పవర్‌ఫుల్‌ పాత్ర చేశా. ప్రజలు నన్ను ఎలాంటి పాత్రలో చూడాలని అనుకున్నారో ఈ సినిమాతో అది ఫుల్‌ ఫిల్‌ అయ్యింది. ఇప్పుడు యాక్షన్‌ అనేది నాకు పెద్ద ఛాలెంజ్‌. కానీ చేశాను. నా యాక్షన్‌ పెర్ఫార్మెన్స్‌ని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. అందరూ వారి పాత్రలని అద్భుతంగా చేశారు. అందుకే సినిమాకి అద్భుతమైన రిజల్ట్‌ వచ్చింది. ఇందులో తల్లితండ్రులు, కొడుకుల బంధాన్ని, వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని బలంగా చూపిండం జరిగింది. ఈ కథని దర్శకుడు పర్ఫెక్ట్‌గా హ్యాండిల్‌ చేశారు. చాలా మంది మహిళలు ఫోన్‌ చేసి సినిమా అద్భుతంగా ఉంది. తల్లీ కొడుకుల ఎమోషన్‌ కట్టిపడేసిందని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇకపై కూడా ఫుల్‌ లెన్త్‌ యాక్షన్‌ ఉన్న క్యారెక్టర్స్‌ వస్తే కచ్చితంగా నటిస్తాను’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img