- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌కు చెందిన విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. కేరళ రాజ్‌భవన్‌లో నారాయణన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దళిత కమ్యూనిటీకి చెందిన నారాయణన్.. 1997 నుంచి 2002 వరకు రాష్ట్రపతిగా విధులు నిర్వర్తించారు. ఆయన సేవలు స్మరించేందుకు ఛాతి భాగం వరకు ఉన్న నారాయణన్ ప్రతిమను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పినరయి విజయన్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, బీహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ పాల్గొన్నారు.
- Advertisement -