నవతెలంగాణ – హైదరాబాద్: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ చికిత్స అనంతరం కోలుకున్నాడు. కుమారుడు గాయపడిన విషయం తెలిసిన వెంటనే పవన్ సింగపూర్ వెళ్లారు. అక్కడి ఆసుపత్రిలో చికిత్స అనంతరం మార్క్ శంకర్ కోలుకోవడంతో అతడితో కలిసి హైదరాబాద్ పయనమయ్యారు. ఈ ఉదయం భార్య అన్నాలెజినోవా, మార్క్ శంకర్‌తో కలిసి పవన్ శంషాబాద్ చేరుకున్నారు. కుమారుడిని ఎత్తుకుని విమానాశ్రయం నుంచి పవన్ బయటకు వస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
- Advertisement -