Tuesday, May 6, 2025
Homeతాజా వార్తలుమే 20న 'గ్రామీణ బంద్‌'

మే 20న ‘గ్రామీణ బంద్‌’

- Advertisement -

– బీజేపీ కార్పొరేట్‌, హిందూత్వ, మనువాద విధానాలపై పోరాటం
– రాష్ట్రంలో నెల రోజుల పాటు ప్రచార కార్యక్రమం : ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ వచ్చే నెల 20న గ్రామీణ బంద్‌ చేపట్టనున్నట్టు ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏఐఏడబ్ల్యూయూ, బీకేఎంయూ సంయుక్తంగా సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ గ్రామీణ ధనిక వర్గానికి వ్యతిరేకంగా పేదలందరినీ ఐక్యం చేయటమే కీలక లక్ష్యంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్పొరేట్‌ హిందుత్వ, మనువాద విధానాలపై వచ్చే నెల 20 వరకు ప్రచార కార్యక్రమన్ని నిర్వహించాలన్నారు. దేశంలో ఆహార భద్రతకు ప్రమాదం రాబోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 10కోట్ల కుటుంబాలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
మోడీ ప్రభుత్వం కంపెనీ వ్యవసాయానికి ఆరాటపడుతోందని విమర్శించారు. చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ, పట్టణ పేదలు ఇప్పటికీ ఉపాధి అవకాశాలు లేక తీవ్ర కష్టాలు పడుతున్నారన్నారు. ఉపాధి హామీకి రూ.2.5 లక్షల కోట్ల నిధులను ఇవ్వాల్సుండగా కేవంల రూ.86 వేల కోట్ల నిధులనే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై గురువారం హైదరబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉభయ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో ఏఐఏడబ్ల్యూయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములు, రాష్ట్ర నాయకులు ఆర్‌. ఆంజనేయులు, బీకేఎంయూ రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య, రాష్ట్ర నాయకులు వేముల బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -