నవతెలంగాణ-హైదరాబాద్: పరస్పర టారిఫ్‌లతో చైనా, అమెరికా దేశాల మధ్య ట్రేడ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యంతో తాము ఎలాంటి వాణిజ్య చర్చలు జరపడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి గువో జియాకున్ స్పష్టం చేశారు. చైనా- అమెరికాల మధ్య వాణిజ్య చర్చలకు సంబంధించిన సంప్రదింపులేవీ జరగడం లేదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తమ మధ్య ఎలాంటి చర్చలు లేవన్నారు. వాణిజ్య ఒప్పందం చేసుకోలేదని చెప్పారు. ఈసందర్భంగా సుంకాలపై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే, ఆ చర్చలు పరస్పర గౌరవం, సమానత్వంతో ముడిపడి ఉంటాయన్నారు. చైనా ఉత్పత్తులపై అమెరికా 145 శాతం టారిఫ్‌లు ప్రకటించడంతో ఇరుదేశాల మధ్య వాణిజ్యయుద్ధం తారస్థాయికి చేరింది. చైనా దేశం నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై సుంకాలు గణనీయంగా తగ్గుతాయని.. కానీ, సున్నాకు మాత్రం రావన్నారు. భవిష్యత్తులో జరిగే చర్చల్లో బీజింగ్‌తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తామని ఇటీవల ట్రంప్ తెలిపినవిషయం తెలిసిందే. అయితే ఇరుదేశాల మధ్య ఏవిధమైన చర్చలు కొనసాట్లేదని బీజింగ్ ప్రకటించింది.
యూఎస్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు జరపలేదు: చైనా
- Advertisement -
RELATED ARTICLES