Sunday, June 8, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిరాలే పచ్చని పువ్వులం మేం మొదట

రాలే పచ్చని పువ్వులం మేం మొదట

- Advertisement -

మీ ఆటను చూసి ఆనందించాం
మా అందరికే ఆ కప్పులొచ్చాయని
గంతులేసి ఎగిరెగిరి దూకాం

మరోసారి
మీ వేడుకల హేలలో
మీ కంటే ఎక్కువగా సంబరపడి
ఒకరినొకరం
తోసుకొచ్చి ఉక్కిరిబిక్కిరై,
ఊపిరాడని
మా వెర్రి అభిమానం తోడై

ఈ రెండో ఆట ‘తొక్కిసలాట’లో
తొక్కుడుకు గురై చచ్చిన మేం..
అమర అభిమానులుగా
నిలిచేందుకు
ఒక్క హృదయంలో కూడా
చోటు దొరక్క
మళ్లీ మళ్లీ చస్తున్నాం!
మా కోసం ఏడవకండి!!
ఇంకొన్ని పూవులు
ఇలా రాలకుండా
చూసుకోండి చాలు!!
– గిరిధర్‌, 9849801947

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -