Wednesday, April 30, 2025
Homeసినిమారేసీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌

రేసీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌

నవీన్‌ చంద్ర నటించిన రేసీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘ఎలెవెన్‌’. దీనికి సుందర్‌ సి వద్ద ‘కలకలప్పు2, వంద రాజవతాన్‌ వరువేన్‌, యాక్షన్‌’ వంటి చిత్రాలకు అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్‌ అజ్ల్స్‌ దర్శకత్వం వహించారు. ఏఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై అజ్మల్‌ ఖాన్‌, రేయా హరి నిర్మించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ‘సిలా నేరంగలిల్‌ సిలా మణిధర్గల్‌, సెంబి’ చిత్రాల విజయం తర్వాత ఇది వీరి మూడవ వెంచర్‌. ‘సిలా నేరంగలిల్‌ సిలా మణిధర్గల్‌’లో నటించిన రేయా హరి ఇందులోనూ కథానాయికగా నటించింది. ఈ బైలింగ్వల్‌ రేసీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ థియేట్రికల్‌ హక్కులను రుచిర ఎంటర్టైన్మెంట్స్‌ ఎన్‌. సుధాకర్‌ రెడ్డి సొంతం చేసుకున్నారు. దీన్ని మే 16న రిలీజ్‌ చేయబోతున్నారు. నవీన్‌ చంద్ర నటించిన ఈ చిత్రం ఈ వేసవిలో అద్భుతమైన సినిమా ఎక్స్‌ పీరియన్స్‌ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు వంటి ప్రతిభావంతులైన తారాగణం కీలక పాత్రల్లో నటించించారు. ఈ చిత్రానికి సంగీతం: డి.ఇమ్మాన్‌, సినిమాటోగ్రఫీ : కార్తీక్‌ అశోకన్‌ , ఎడిటింగ్‌ : శ్రీకాంత్‌ ఎన్‌.బి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img