Wednesday, April 30, 2025
Homeబీజినెస్లక్ష దాటేసిన బంగారం ధర

లక్ష దాటేసిన బంగారం ధర

– గ్రాము రూ.10,135
న్యూఢిల్లీ : బంగారం ధరలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. తులం బంగారం రూ.1 లక్ష దాటేసింది. గ్రాము ధర రూ.10,000 పైమాటే. గుడ్‌ రిటర్న్స్‌ సమాచారం మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఒక్క గ్రాముపై రూ.300 పెరిగి రూ.10,135గా పలికింది. అంతర్జాతీయంగా ఔ న్సు లేదా 31.10 గ్రాముల బంగారం ధర 3,467 డాలర్లకు చేరింది. న్యూఢి ల్లీ బులి యన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగా రంపై రూ.3,000 పెరిగి రూ.1,01,500గా నమోదయ్యింది. 22 క్యారెట్ల స్వచ్చత కలిగిన బంగారంపై రూ.2,750 పెరిగి రూ.93,050గా చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ధర రూ.1,01,350గా, 22 క్యారె ట్ల ధర రూ.92,900గా పలికింది. ట్రంప్‌ టారిఫ్‌లకు తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగించనుందన్న సంకేతాలు బంగారం ధరలకు ఆజ్యం పోస్తోన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img