- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు ఉధృతంగా జరుగుతున్న వేళ జమ్మూ కాశ్మీర్‌పై విరుచుకుపడేందుకు యత్నించారు. ఈ ఉదయం 9 గంటలకు లాండ్ ప్యాడ్ దాడులకు ఉగ్రమూకలు ప్రయత్నం చేశారు. భారత సరిహద్దు ప్రాంతానికి ఎదురుగా ఉన్న పాకిస్థాన్‌లోని సియాల్ కోట్ జిల్లా లూని నుంచి ల్యాంచ్ ప్యాడ్ దాడికి రాత్రి సమయంలో యత్నించారు. అయితే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు వెంటనే భారత భూభాగమైన జమ్మూసెక్టార్‌లోని అఖ్నూర్ ప్రాంతం నుంచి దాడి చేసి ధ్వంసం చేశారు.
- Advertisement -