Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంవామపక్షాల ఐక్యతను బలోపేతం చేద్దాం

వామపక్షాల ఐక్యతను బలోపేతం చేద్దాం

- Advertisement -

– సీపీఐ(ఎం), సీపీఐ పార్టీల నేతలు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో

వామపక్షాల ఐక్యతను బలోపేతం చేద్దామని సీపీఐ(ఎం), సీపీఐ పార్టీల నేతలు పునరుద్ఘాటించారు. అందుకు రెండు పార్టీలు చొరవ చూపాలని నిర్ణయించారు. ఇటీవల సీపీఐ(ఎం) నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఎం.ఎ బేబీని సీపీఐ వారి కార్యాలయానికి ఆహ్వానించింది. అందులో భాగంగా సోమవారం సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబీ, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు నీలోత్పల్‌ బసు, అశోక్‌ ధావలే, ఆర్‌. అరుణ్‌ కుమార్‌లతో కూడిన బృందం సీపీఐ ప్రధాన కార్యాలయం (అజరు భవన్‌)ను మర్యాదపూర్వకంగా సందర్శించింది. ఈ సందర్భంగా వామపక్ష ఐక్యత తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అనీరాజా, పల్లబ్‌ సేన్‌ గుప్తా, కష్ణా ఝా, ఇతర ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad