- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో 3.38 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులపై అనుమానంతో అధికారులు వారి రెండు బ్యాగులను తనిఖీ చేశారు. అందులో ఉన్న ఐరన్ బాక్సు పరిశీలించగా రూ.3.36 కోట్లు విలువైన 3.38 కిలోల బంగారం బయటపడింది. దీంతో వారిని ఎయిర్ పోర్ట్ అధికారులు అరెస్ట్ చేసి బంగారం స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -