నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు, అందుకు ఆపరేష్ సిందూర్ పై పలు దేశాలకు వివరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ ఎంపీల బృందాన్ని ఏర్పాటు చేసింది. దేశంలోని ఆయా పార్టీలు నివేదించిన పేర్లతో కేంద్రం ఏడుగురు ఎంపీలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా (బీజేపీ), సంజయ్ కుమార్ ఝా (జెడియు), కనిమొళి కరుణానిధి (డీఎంకే), సుప్రియా సులే (ఎన్‌సిపి), శ్రీకాంత్ ఏక్‌నాథ్ షిండే (శివసేన) పేర్లను కేంద్రం ప్రకటించింది.ఈఏడుగురు అఖిలపక్ష ప్రతినిధులు ఈ నెల చివర్లో UN భద్రతా మండలి సభ్యులతో సహా కీలక భాగస్వామి దేశాలను సందర్శించనున్నారు.ప్రపంచంలోని వివిధ దేశాల్లో తమ బృందలోని ఒక్కో సభ్యుడు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. వీరు పాక్ ఉగ్ర కుట్రలను అన్ని దేశాలకు తెలిసేలా వివరించనున్నారు. కాగా అమెరికాకు శశిథరూర్ నేతృత్వంలో బృందం వెళ్లనుంది. అలాగే తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా బృందం, రష్యాకు కనిమొళి నేతృత్వంలోని బృందం, ఆగ్నేయాసియాకు సంజయ్ ఝా బృందం, మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం, పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే బృందం, ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ షిండే బృందం వెళ్లనుంది. ఈ నెల 22, 23 న నుంచి వీరి పర్యటన ప్రారంభంకానుంది.
సిందూర్‌పై ప్రపంచ ప్రచారానికి ఎంపీల బృందం
- Advertisement -
- Advertisement -