కె.సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణ చంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన అవార్డ్ విన్నింగ్ మూవీ ‘ముత్తయ్య’. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్‌ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. దివాకర్ మణి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గానే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. త్వరలో ఈ సినిమా ఈటీవీ విన్‌లో ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం హీరో విజరు దేవరకొండ చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ‘సీనిమాల యాక్ట్ జేశి..’ పాటను రిలీజ్ చేశారు. ‘సీనిమాల యాక్టు జేశి ఎలిగిపోతవా…బుట్టలల్లుకుంట ఊళ్ళె మిలిగిపోతవా.. ముత్తయ్య… తిక్క తిక్క ఈడియోలు జేసుకుంటవా..స్టెప్పులేసి ఎగిరి దుంకి సంపుతుంటవా..ముత్తయ్య…. పేమసైతవా పేళ్లు గోళ్లు గిల్తవా… దేశమంత లొల్లి జేస్తావా… డ్యాన్సు జేస్తవా డయ్యిలాగు జెబుతవా ఓపికంత కూడ వెడ్తావా… ముత్తయ్య..’ అంటూ ముత్తయ్య వెండితెర కలను వర్ణిస్తూ సాగుతుందీ పాట. ఈ పాటను లాంచ్ చేయడం సంతోషంగా ఉందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా తమ కలల్ని సాకారం చేసుకోవాలని విజరు దేవరకొండ అని అన్నారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ రోడ్రిగ్స్ బ్యూటిఫుల్ ట్యూన్‌తో కంపోజ్ చేశారు. దర్శకుడు భాస్కర్ మౌర్య ముత్తయ్య పాత్రను రిఫ్లెక్ట్ చేస్తూ లిరిక్స్ రాయగా, చిన్నా.కె ఆకట్టుకునేలా పాడారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం – భాస్కర్ మౌర్య, నిర్మాతలు – వంశీ కారుమంచి, వందా ప్రసాద్, సహ నిర్మాత – దివాకర్ మణి, అసోసియేట్ నిర్మాత – హేమంత్ కుమార్ సిఆర్, సినిమాటోగ్రాఫర్ – దివాకర్ మణి, సంగీతం- కార్తీక్ రోడ్రిగ్స్, ఎడిటర్ – సాయి మురళి, సౌండ్ డిజైన్ అండ్ మిక్సింగ్ – వంశీప్రియ రసినేని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత – వెంకట్ కష్ణ, ఆర్ట్ – బాలు.
‘సీనిమాల యాక్ట్ జేశి..’
- Advertisement -
RELATED ARTICLES