Wednesday, April 30, 2025
Homeజాతీయంసోనియా, రాహుల్‌గాంధీలకు నోటీసుల జారీకి నిరాకరించిన ఢిల్లీ కోర్టు

సోనియా, రాహుల్‌గాంధీలకు నోటీసుల జారీకి నిరాకరించిన ఢిల్లీ కోర్టు

న‌వ‌తెలంగాణ-హైద‌రాబాద్‌: నేషనల్‌ హెరాల్డ్‌కి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలు సోనియా, రాహుల్‌గాంధీలకు నోటీసులు జారీ చేసేందుకు ఢిల్లీకోర్టు శుక్రవారం నిరాకరించింది. కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం.. నిందితుల వాదనలు వినకుండా ఫిర్యాదు (చార్జిషీట్‌కు సమానమైన ఈడి )ని పరిగణనలోకి తీసుకోలేమని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్‌ గోగే పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలకు నోటీసులివ్వాలంటూ ఈడి దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. అటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అన్నారు. చార్జిషీట్లో కొన్ని పత్రాలు లేవని, ఆ పత్రాలను దాఖలు చేయాలని ఈడిని ఆదేశించారు. ఆ తర్వాత నోటీసులు జారీ చేసే అంశాన్ని నిర్ణయిస్తామని పేర్కొన్నారు. తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img