Tuesday, May 6, 2025
Homeజాతీయంహర్యానాలో మాజీ ఎమ్మెల్యే ధరమ్‌ సింగ్‌ చోకర్‌ అరెస్ట్‌

హర్యానాలో మాజీ ఎమ్మెల్యే ధరమ్‌ సింగ్‌ చోకర్‌ అరెస్ట్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పరారీలో ఉన్న హర్యానా కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే ధరమ్‌ సింగ్‌ చోకర్‌ను ఈడి అరెస్ట్‌ చేసినట్లు అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి. చోకర్‌ను ఆదివారం ఢిల్లీలోని ఒక హోటల్‌ నుండి అదుపులోకి తీసుకున్నామని, నేడు ఆయనను గురుగ్రామ్‌లోని కోర్టు ఎదుట హాజరుపరచనున్నట్లు ప్రకటించాయి. పానిపట్‌ జిల్లాలోని సమల్ఖా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న చోకర్‌ గతేడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చోకర్‌ను గతేడాది ఈడి అరెస్ట్‌ చేసింది. బెయిల్‌పై విడుదలైన ఆయన పరారాలో ఉన్నారు. చోకర్‌, ఆయన కుమారులు వికాస్‌ చోకర్‌ (పరారీలో ఉన్నారు), సికిందర్‌ చోకర్‌లు 1500 మందికి పైగా గృహవినియోగదారులను మోసం చేసి, వారి నుండి రూ.500 కోట్లకు పైగా నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద కోర్టు చోకర్‌ మరియు వికాస్‌ చోకర్‌లకు పలు నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. మే 19న కోర్టు ఎదుట హాజరుకావాలని కూడా ఆదేశించింది. సాయి ఐనా ఫార్మ్స్‌ మరియు అనుబంధ కంపెనీలపై గురుగ్రామ్‌ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడి ఈ కేసు దాఖలు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -