నవతెలంగాణ-హైదరాబాద్: ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హార్వర్డ్ యూనివర్సీటీ సంచలన నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీకి నిధుల కోత పెడుతూ.. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాంపై కోర్టులో దావా వేసింది. హార్వర్డ్‌కు నిధులు నిలిపివేయడం ద్వారా విద్యాపరమైన నిర్ణయాలపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తున్నారని కేసు దాఖలు చేసింది. ట్రంప్ యంత్రాంగం లక్ష్యంగా చేసుకున్న ఇతర విద్యాసంస్థల పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొంది. విశ్వవిద్యాలయానికి నిలిపివేసిన 2.2 బిలియన్ డాలర్లకు పైగా గ్రాంట్ నిధులను సమాఖ్య ప్రభుత్వం నిలిపివేయాలనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని కోరింది. గత వారం హార్వర్డ్ తన చట్టవిరుద్ధమైన డిమాండ్లను పాటించడానికి నిరాకరించడంతో సమాఖ్య ప్రభుత్వం విశ్వవిద్యాలయంపై ఇటువంటి చర్యలు తీసుకుంటోందని హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ పేర్కొన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్ డాలర్ల నిధులపై ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే కోత విధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇటీవల ఆదేశంలో భారీ నిరసనలు చేపట్టారు. వలసదారులపై అమాననీయ చర్యలు తగవని, డొనాల్డ్ ట్రంప్‌ను గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
‘హార్వర్డ్’ సంచలన నిర్ణయం..ట్రంప్ ప్రభుత్వంపై దావా
- Advertisement -